జపాన్ వేదికపై మరోసారి మెరవనున్న రష్మిక
రష్మిక మందన్న అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అందుకుంది. జపాన్‌లో జరిగే ప్రతిష్టాత్మక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్‌కు వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా ఎంపికై, ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా చరిత్ర సృష్టించింది. 2026 మే 23న టోక్యోలో జరగనున్న ఈ వేడుకల 10వ ఎడిషన్లో ఆమె పాల్గొననుంది. గతేడాది కూడా ఆమె ప్రెజెంటర్‌గా మెరిసిన సంగతి తెలిసిందే.