ప్రమాదకరంగా నీటి సంపు

SRD: కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నీటి సంపు ప్రమాదకరంగా మారింది. నీటి సంపుపై ఉన్న పైకప్పు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కుప్పకూలిపోయింది దీంతో పైకప్పు లేక ప్రమాదకరంగా మారిపోయింది. వేలాదిమంది ఆర్టీసీ బస్టాండ్‌లోకి వచ్చి పోతున్న క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున స్థానిక ఎస్సై బాల్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు.