నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: బోరజ్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. 33కేవీ బాలాజీ ఫీడర్ లైన్ మరమ్మతుల కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని తర్నం, బాలాపూర్, మండగడ, కామాయి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.