ఘనంగా అన్నపూర్ణమ్మ గ్రామోత్సవం
W.G: పెంటపాడు(మం) బి.కొండేపాడు గ్రామంలో కాశీ అన్నపూర్ణమ్మ గ్రామోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో గ్రామ పురవీధుల్లో అమ్మవారిని వైభవంగా ఊరేగించారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.