ఉరుమడ్లలో పోటీలో నిలిచిన అంగన్వాడీ టీచర్
NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో అంగన్వాడీ టీచర్ గత 18 ఏళ్లుగా పనిచేస్తూన్న సాగర్ల భానుశ్రీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచార. గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమె అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచారు. మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆశీస్సులతో ప్రచారం కొనసాగిస్తున్నారు.