యువకుడిపై పోక్సో కేసు నమోదు
BDK: ప్రేమ పేరుతో బాలికను వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతీరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వరావుపేటకి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఆరేపల్లి వెంకన్న (23)అనే యువకుడు ఆ బాలికను ప్రేమ పేరుతో వెంటపడి వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వెంకన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.