చట్టమయితే ఏం అవుతుందంటే?: కేటీఆర్
TG: అసెంబ్లీలో అరు గ్యారెంటీలపై తాము ప్రైవేటు బిల్లు పెడుతామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. తాము పెట్టే బిల్లు పాస్ అయితే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ చట్టప్రకారంగా అమలవుతాయన్నారు. ఒకవేళ అమలు చేయకపోతే.. కోర్టు మొట్టికాయలు వేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాయని చెప్పారు. తాము పెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు వారి ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలన్నారు.