చీమల మందు తాగి మహిళ మృతి

SKLM: కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామానికి చెందిన లక్ష్మి (37) చీమల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. దాచుకున్న డబ్బులతో భర్త రామారావు మద్యం తాగి తనతో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన లక్ష్మి చీమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగువారు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందూతు బుధవారం మరణించింది.