నేడు నందిమల్లలో చేతిరాళ్ల పోటీలు
WNP: అమరచింత మండలం నందిమల్లలో వెలసిన శ్రీ చింతల ముని రంగస్వామి జాతరను పురస్కరించుకుని సోమవారం చేతిరాళ్ల ఎత్తే పోటీలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు మొత్తం నాలుగు బహుమతులు అందజేయనున్నారు. ఆసక్తి గల వారు వివరాల కోసం 8341994652, 9177021811 నంబర్లలో నిర్వాహకులు ఆశన్న, శివరాజు, సూరిలను సంప్రదించాలని కోరారు.