'పోలీసు ప్రజా భరోసా' కార్యక్రమం
SRPT: మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో మునగాల పోలీసులు నిర్వహించిన 'పోలీసు ప్రజా భరోసా' కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ, యువత లక్ష్యం దిశగా పయనించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరి ధరించాలని సూచించారు.