మహిళలతో కలిసి నిరసన చేపట్టిన తుని ఎమ్మెల్యే
KKD: మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాలు అడ్డుకోవడం శోచనీయమని యనమల దివ్య విమర్శించారు. శనివారం సాయంత్రం తేటగుంటలో మహిళలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యనమల దివ్య ప్లకార్డులు ప్రదర్శించి ర్యాలీ చేపట్టారు. మహిళా హక్కులను అడ్డుకునే వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.