భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

VKB: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మర్పల్లి ఎస్సై అబ్దుల్ రవూఫ్ మండల ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని, వాహనదారులు వాగులు దాటే ప్రయత్నం చేయకూడదన్నారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ స్తంభాన్ని తాకే ప్రయత్నం చేయరాదన్నారు.