23 నుంచి రాష్ట్రంలో జాతీయస్థాయి క్రీడోత్సవాలు
AP: అమరావతిలోని SRM వర్సిటీలో ఈ నెల 23 నుంచి ఉద్గమ్-2026 పేరిట జాతీయస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు సాగే ఈ క్రీడాపోటీలకు దేశంలోని పలు వర్సిటీల నుంచి 500 మందికి పైగా హాజరుకానున్నారు. గురువారం ఉదయం వర్సిటీ క్రీడామైదానంలో జరిగే ప్రారంభ వేడుకలను రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ముఖ్య అతిథిగా హాజరుకానుంది.