సాధికార సభ్యులతో దామచర్ల సమావేశం

ప్రకాశం: ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సాధికార సభ్యులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి 60 ఓటర్లకు ఇద్దరు కుటుంబ సాధికార సభ్యులను ఎంపిక చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు సాధికార కమిటీలు దోహదం చేస్తాయన్నారు.