ఇసుక బుకింగ్ యాప్ ద్వారానే ఇసుక
NRML: జిల్లాలో ఇసుక విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగేందుకు ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలు జరగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. నిర్మాణ అవసరాల కోసం ఇసుకను కొనుగోలు చేయాలనుకునే ప్రజలు తప్పనిసరిగా యాప్ ద్వారా రుసుము చెల్లించి మాత్రమే ఇసుకను పొందాలని సూచించారు.