ఎరువుల దుకాణం తనిఖీ చేసిన అధికారులు

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన అధికారులు

GNTR: చేబ్రోలు మండలం నారాకోడూరులోని మన గ్రోమోర్ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎరువుల నిల్వలను, పీఓఎస్ స్టాక్‌ను పరిశీలించారు. నాణ్యత నిర్ధారణ కోసం ఎరువుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడానికి ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఆమె తెలిపారు.