'పరారైన ఖైదీ 24 గంటల్లో పట్టుబడ్డాడు'
ప్రకాశం: ఒంగోలు బస్టాండ్ నుంచి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారైన ఖైదీని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జైలు నుంచి వైజాగ్‌కు ఇరువురు నిందితులను తీసుకువెళ్తుండగా ఒంగోలు బస్టాండ్ వద్దకు ఆదివారం రాత్రి ఎస్కార్ట్ పోలీసులు చేరుకున్నారు. అక్కడ వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు అనే నిందితుడు పారిపోయాడు. కాగా ఒంగోలు వన్‌టౌన్ PSలో ఫిర్యాదు అందింది.