గర్భిణుల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట

గర్భిణుల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట

ASR: గర్భిణుల ఆరోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో జీ.వెంకటరమణి సోమవారం తెలిపారు. గర్భిణులకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా రూ.11వేల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. గర్భిణులు ఆర్థిక సాయం పొందేందుకు https://pmmvy.wcd.gov.in వెబ్సైట్‌లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.