పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: గూడూరు మండలం పొనుగోడు జడ్పీ పాఠశాలలో రూ. 54 లక్షలతో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రారంభించారు. జిల్లా అధికారులతో కలిసి అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జన్నారెడ్డి, భరత్ చందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.