నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు
ELR: తుఫాన్ ప్రభావంతో వరదలకు గురైన బాధిత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో వరద బాధితులకు ఎమ్మెల్యే ధర్మరాజు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి రాందేవ్ లక్ష్మీ సునీత, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.