జిల్లాలో నేటి నుంచి పల్నాటి వీరుల ఉత్సవాలు

జిల్లాలో నేటి నుంచి పల్నాటి వీరుల ఉత్సవాలు

పల్నాడు జిల్లాలోని కారంపూడిలో నేటి నుంచి 5 రోజుల పాటు పల్నాటి వీరుల ఉత్సవాలు ప్రారంభమవనున్నాయి. ఈ ఉత్సవాలు పల్నాడు చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ క్రమంలో ఈ నెల 19న రాచగావు, 20న రాయబారం, 21న మందపోరు, 22న కోడిపోరు, 23న కల్లిపాడు వంటి ప్రధాన ఘట్టాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొననున్నట్లు సమాచారం.