కలెక్టర్‌కు బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ వినతి
TG: జగిత్యాల జిల్లా లంబాడి పల్లెకు చెందిన మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ ఐకేపీ కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం లేక రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలం కేటాయిస్తే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు.