ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం

అనంతపురం నగరం పాతఊరు వద్ద ఉన్న కస్తూర్బా పాఠశాలలో చదవుతూ అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. బుధవారం ఉదయం స్కూలుకు వెళ్లిన పిల్లలు ఎవరికీ చెప్పకుండా రైల్వేస్టేషకు చేరుకుని, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు. తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బెంగళూరు సమీపంలోని హెబ్బాల్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో పిల్లలను గుర్తించినట్లు పేర్కొన్నారు.