అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
NRML: అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె ఆవిష్కరించారు. ఆసుపత్రులు, హోటళ్లు, పాఠశాలలు, గ్యాస్ గోడౌన్లలో అగ్నిమాపక నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.