తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే సతీమణి
CTR: ఎస్.ఆర్ పురం మండలం వెంకటాపురం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తాగునీటి సమస్య బుధవారం పరిష్కరించారు. తాగునీటి సమస్యను తీర్చుతానని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సతీమణి శాంతి హామీ ఇచ్చారు. హామీని బుధవారం పూర్తి చెయ్యడంతో గ్రామస్థులు ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.