రైలుపై రాళ్లు విసరిన వ్యక్తి అరెస్ట్

MDCL: మల్కాజ్‌గిరి రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు రైలుపై రాళ్లు విసరిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు. ఘటనలో ఎలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా వెంటనే చర్యలు తీసుకున్నట్లు అధికారులు ఇవాళ తెలిపారు. ఈ ఘటనతో రైలు సేఫ్టీపై ప్రత్యేక దృష్టి అవసరమని రైల్వే అధికారులు సూచించారు.