సీఎం క్షేమం కోసం ప్రత్యేక హోమాలు
ATP: సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ రాయదుర్గంలోని శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శృంగేరి మఠం వేద పండితుల నుంచి ఈ నెల 11 నుంచి 20 వరకు ‘దశమహావిద్యలు’ పేరుతో కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇవాళ భువనేశ్వరి దేవి హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.