బెల్ట్ షాపులు మూసివేయాలని తీర్మానం

RR: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం ఉత్తరాస్ పల్లి గ్రామంలో నేడు పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామానికి చెందిన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామస్తులు తీర్మానించారు. గ్రామ నాయకులు మాట్లాడుతూ.. బెల్టు షాపుల నుండి మద్యం అమ్మితే అమ్మిన వారికి రూ. 10 లక్షలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.