VIDEO: రావులపాలెంలో దట్టంగా అలుముకున్న పొగ మంచు
కోనసీమ: రావులపాలెం మండలంలోని పలు ప్రాంతాలలో ఆదివారం ఉదయాన్నే పొగమంచు కమ్మేసింది. మంచు వీడకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు కనిపించక వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. భారీ మంచు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని మామిడి రైతులు వాపోతున్నారు. శీతల గాలులు వీస్తుండటంతో ఉదయం జనజీవనం స్తంభించింది.