వల్లూరులో 19న రెవెన్యూ క్లినిక్ తహసీల్దార్
KDP: వల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈనెల 19వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు 'రెవెన్యూ క్లినిక్' నిర్వహిస్తున్నట్లు M.R.O శ్రీవాణి శనివారం తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాన్ ఇర్విన్ పాల్గొంటారని, రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అర్జీలు స్వీకరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.