సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

BHPL: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశచూపి మోసం చేస్తున్నారన్నారు. మొబైల్‌కి వచ్చే OTP చెప్పవద్దన్నారు.