పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు
MBNR: దసరా పండుగను పురస్కరించుకుని జడ్చర్ల పురపాలక పరిధిలోని పారిశుధ్య కార్మికులకు జడ్చర్ల పురపాలక 24వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి గురువారం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పాశుద్ధ్య కార్మికులకు దసరా సందర్భంగా నిత్యవసర సరుకులను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.