వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం
SDPT: బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల కోసం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి 2 నుంచి 13 వరకు జరిగే ఈ శిక్షణలో తొలి విడతగా 11 గ్రామ పంచాయతీలకు చెందిన 102 మంది సభ్యులు పాల్గొనాల్సి ఉండగా, 81 మంది హాజరై 21 మంది గైర్హాజరయ్యారు. ఐదు రోజుల పాటు స్థానిక పాలన, గ్రామాభివృద్ధి పథకాలు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తున్నారు.