'ఉపాధి హామీ చట్టం రద్దు కుట్రను సహించం'
KRNL: ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావడం పేదల జీవనంపై దాడి అని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు. 150 పని దినాలు, కూలి పెంపు వంటి సిఫార్సులను కేంద్రం విస్మరించడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా నిలదీయాలని, లేకపోతే ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.