నగరంలో పంజా విసురుతున్న చలి
HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిన్న పిల్లలు, వృద్ధులు దగ్గు, జలుబు, జ్వరం, ఆస్తమా, బ్రాంకెటీస్, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు, ఛాతిలో నిమ్ము వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.