బాంబు భయాలు.. ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ల తాకిడి!
ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత పలు ప్రాంతాల నుంచి అత్యవసర నంబర్లకు ఫోన్ల తాకిడి పెరిగినట్లు అధికారులు తెలిపారు. 'తొలుత రాత్రి 9.15 గంటల సమయంలో బిజ్వాసన్ ప్రాంతంలో ఓ బ్యాగ్ చూసినట్లు ఫోన్ వచ్చింది. అక్కడి వెళ్లి చూడగా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. తర్వాత వసంత్ విహార్, ద్వారకా సెక్టార్ 13 నుంచి, కశ్మీర్ గేట్ నుంచి, ఖజూరీ ఖాస్ నుంచి ఫోన్లు వచ్చాయి' అని చెప్పారు.