VIDEO: నర్సీపట్నంలో వదలని గ్యాస్ కష్టాలు

VIDEO: నర్సీపట్నంలో వదలని గ్యాస్ కష్టాలు

AKP: నర్సీపట్నంలో గ్యాస్ కష్టాలు వినియోగదారులను వదలడం లేదు. ఆదివారం గ్యాస్ ఇస్తారని సమాచారం మేరకు పలువురు వినియోగదారులు సిలిండర్లతో సహా బారులు తీరారు. ఉదయం ఐదు గంటల నుంచి గ్యాస్ సిలిండర్ల కోసం వేచి చూస్తున్నామని ప్రజలు వాపోయారు. బుక్ చేసుకున్న నెలరోజుల తర్వాత గాని సిలిండర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.