జిల్లా కాంగ్రెస్ మెడికల్ వింగ్ ఛైర్మన్‌గా డా. పీ. శ్రవణ్ కుమార్

జిల్లా కాంగ్రెస్ మెడికల్ వింగ్ ఛైర్మన్‌గా డా. పీ. శ్రవణ్ కుమార్

హన్మకొండ కాంగ్రెస్ మెడికల్ వింగ్ ఛైర్మన్‌గా డా. పీ. శ్రవణ్ కుమార్ నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని శుక్రవారం అందజేశారు. వైద్య విభాగం ద్వారా ప్రజలకు సేవలందిస్తూ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు శ్రవణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.