నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

AKP: 33/11 KV సబ్ స్టేషన్ పరిధి మాకవరపాలెం ఫీడర్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడు తుందని నర్సీపట్నం ఈఈ అప్పారావు తెలిపారు. లైన్ మరమ్మతుల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కొత్తవీడి, రాజారావుపేట, కింది వీధి ప్రాంతాలలో శనివారం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామన్నారు.