నీట మునిగిన పంటల పరిశీలన

KMR: పిట్లం మండలంలోని బ్రాహ్మణపల్లిలో సోమవారం ఏఈఓ సురేష్ పంటలను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నీట మునిగిన పంటలను సర్వే చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు చెప్పారు. అనంతరం పంటలకు తగు సూచనలను, జాగ్రత్తలను రైతులకు తెలిపారు.