9 మంది యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించిన షీ టీం పోలీసులు

9 మంది యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించిన షీ టీం పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలో కళాశాలల వద్ద మైనర్ బాలికలను మాయ మాటలు చెప్పి ఒంటరి ప్రదేశాలకు తీసుకెళ్తున్న 9 మంది యువకులను పోలీసులు గుర్తించారు. శనివారం వారిని షీ టీం కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడం చట్టరీత్యా నేరం అన్నారు. యువత ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు.