నిజాయితీ చాటుకున్న కండక్టర్ కిషన్
KMR: కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో శనివారం ఒక మహిళా ప్రయాణికురాలు కామారెడ్డి సమీపంలోని టేక్రియాల స్టేజి వద్ద బస్సు ఎక్కి తన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ మర్చిపోయింది. సెల్‌ఫోన్ గమనించిన కండక్టర్ కిషన్ ప్రయాణికురాలి టికెట్ ఆధారంగా వివరాలు తెలుసుకొని నిజాయితీగా నలుగురు సమక్షంలో ప్రయాణికురాలికి సెల్ ఫోన్ అప్పగించారు.