ఇంజినీరింగ్ పనులతో రైల్వే ప్రయాణాలకు ఆటంకం

కృష్ణా: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ఆలస్యం కానున్నట్లులు తెలుస్తోంది. దీంతో లోకల్ ప్రయాణికులకు అంతరాయం ఏర్పడుతోంది. మే 8 నుంచి 29 వరకు చర్లపల్లి - తిరుపతి(07257), మే 9 నుంచి 30 వరకు తిరుపతి-చర్లపల్లి(07258) రైళ్లు రద్దయ్యాయి. ఇక మే 4న గుంటూరు-రేపల్లె, రేపల్లె-తెనాలి, తెనాలి-విజయవాడ మధ్య నడిచే రైళ్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి.