ఇంటర్ విద్యార్థికి ఎస్సై సన్మానం

GDWL: గట్టు మండలంలోని రాయపురం గ్రామానికి చెందిన నర్సమ్మ, లక్ష్మణ్ దంపతుల కూతురు లావణ్య జిల్లాలోని బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో.. 439/470 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఎస్సై మల్లేష్ విద్యార్థిని శాలువాతో సన్మానించి అభినందించి రూ. 5 వేలు అందజేశారు.