సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

PDPL: కమాన్ పూర్ మండలం గుండారం రాజేంద్రనగర్‌లో ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ జంగిలి పోచాలు ప్రారంభించారు. గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేందర్, కార్యదర్శి బచ్చల ప్రసాద్, వార్డు సభ్యులు గాదెలతా, రాచకొండ రజిత, పిడుగు కవిత, వడ్లకొండ వసంత పాల్గొన్నారు.