'కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలి'

'కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలి'

KMM: సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, పొన్నెకల్లు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను మార్కెటింగ్ శాఖ సంచాలకులు తనిఖీ నిర్వహించారు. క్రయవిక్రయాల సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.