నేడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పర్యటన

నేడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పర్యటన

NGKL: అమ్రాబాద్ మండలంలో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పర్యటిస్తారని జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు తెలిపారు. అమ్రాబాద్‌లోని బౌరాపూర్‌లో ఆదివాసీ చెంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అనంతరం చెంచులతో కలిసి పంక్తి భోజనం చేయనున్నట్లు పేర్కొన్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.