పింగళి వెంకయ్య జయంతి నేడు

కృష్ణా: జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా పామర్రు మండలం భట్ల పెనుమర్రలో జన్మించిన వెంకయ్య రూపొందించిన పతాకాన్ని 1921 ఏప్రిల్‌లో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకంగా గుర్తించారు. 2009లో ఆయనకు తపాలా బిళ్ల విడుదల చేశారు. 1963 జూలై 4న కన్నుమూశారు.