VIDEO: ఇంటిపై పడిన పిడుగు..తప్పిన ప్రమాదం

VIDEO: ఇంటిపై పడిన పిడుగు..తప్పిన ప్రమాదం

MBNR: ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి ఇంటి పైకప్పుపై పిడుగు పడిన ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం మేకలసోంపల్లిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రవిప్రకాష్ ఇంటిపై పిడుగు పడటంతో వాటర్ ట్యాంక్ ధ్వంసమై గది లోపలికి రంద్రం ఏర్పడింది. ఆ గదిలో ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.