'హెల్మెట్ తప్పనిసరి ధరించాలి'
MHBD: కురవి మండలం తిర్మలాపురం గ్రామ ప్రజలు ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు గ్రామంలోకి అనుమతి ఇవ్వబోమని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ ప్రవేశద్వారంలో ప్రత్యేక స్వాగత ఆర్చ్‌ను ఏర్పాటు చేశారు. కాగా స్వాగత ద్వారం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.